YSRCP third list released వైసీపీ మూడవ జాబితా విడుదల
మూడవ విడత వైసీపీ నియోజక వర్గ ఇన్ చార్జ్ ల లిస్టు ఎట్టకేలకు విడుదల అయ్యింది. అనేక తర్జన భర్జనల అనంతరం మూడవ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసారు. ఎంపీ, ఎమ్మెల్యే నియోజక వర్గాల ఇన్ చార్జ్ లు మొత్తం 21 మంది తో జాబితా రూపొందించారు. ఈ జాబితా లో బీసీ లకు పెద్ద పీట వేసారు. ఈ జాబితా లో 11 అసెంబ్లీ స్థానాలను మరియు 4 పార్లమెంట్ స్థానాల్లో బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ జాబితాలో బీసీ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సామాజిక న్యాయం పాటించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.YSRCP Third List Released
ఎంపిక చేసిన అభ్యర్దుల వివరాలు ఇలా ఉన్నాయి.YSRCP Third List Released
- Srikakulam (MP) : Perada Tilak. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక వర్గానికి ఇన్ చార్జ్ గా శ్రీ పేరాడ తిలక్ ను నియమించారు.
- Visakhapatnam (MP): Botcha Jhansi Lakshmi : అత్యంత ప్రతిష్టాత్మక మైన విశాఖ పట్నం పార్లమెంట్ స్థానానికి ఇన్ చార్జ్ గా శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి నియమితులయ్యారు. ఈమె మంత్రి బొత్స సత్యనారాయణ గారి సతీమణి. ఇంతకు ముందు రెండు సార్లు ఎంపీ గా చేసిన అనుభవం కలిగి ఉన్నారు. విశాఖపట్నం ను రాజధాని గా చేయాలని ప్రయత్నం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ స్థానం చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పవచ్చు. జె.డి లక్ష్మీ నారాయణ లాంటి వారు వైజాగ్ నుండి బరిలో దిగే అవకాశం ఉంది
- Eluru (MP): Karumuri Sunil Kumar Yadav: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను ఇన్ చార్జ్ గా నియమించారు.
- Vijayawada (MP) : Keshineni Nani : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే వైసీపీ లో చేరిన శ్రీ కేశినేని నాని ని విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ ఇన్ చార్జ్ గా నియమించారు. విజయవాడ లో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యం తోనే కేశినేని నాని కి ఈ నియోజక వర్గ భాద్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆయన ఇదే నియోజక వర్గం లో సిట్టింగ్ ఎంపీ గా ఉన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీ లో చేరారు.
- kurnool (MP) : Gummanoori Jayaram : ప్రస్తుతం రాష్ట్ర మంత్రి గా ఉన్న గుమ్మనూరి జయరాం కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గ ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు. ఎమ్మెల్యే గానే పోటీ చేయడానికి ఈయన ఆసక్తి చూపినప్పటికీ పార్లమెంట్ ఇచ్చారు.
- Tirupathi (MP) : Koneti Adimoolam : శ్రీ కోనేటి ఆదిమూలం తిరుపతి పార్లమెంట్ కు ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీ గా ఉన్న డాక్టర్ గురుమూర్తి ని ఈసారి అసెంబ్లీ పంపిస్తున్నారు.
- Ichapuram (MLA) : Piriya Vijaya : ఇచ్చాపురం అసెంబ్లీ నియోజక వర్గానికి పిరియా విజయ ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. పిరియా విజయ స్థానం లో జడ్పీ చైర్ పర్సన్ గా శ్రీమతి ఉప్పాడ నారాయణమ్మ నును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు. నారాయణమ్మ ప్రస్తుతం ఇచ్చాపురం జడ్పీ టీసీ గా ఉన్నారు.
- Tekkali (MLA) : Duvvaada Srinivas: టెక్కలి నుండి దువ్వాడ శ్రీనివాస్ ను నియోజక వర్గ ఇన్ చార్జ్ గా నియమించారు.
- Chintalapudi (MLA-SC): Kambham Vijayaraju: శ్రీ కంభం విజయరాజు ను చింతలపూడి ఇన్ చార్జ్ గా నియమించారు.
- Rayadurgam (MLA) : Mettu Govinda Reddy: ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ కాపు రామచంద్రారెడ్డి సీటు రానందువల్ల పార్టీ మారుతానంటూ సవాల్ చేసారు. అయితే ఆయన బెదిరింపులకు లొంగని అధిష్టానం శ్రీ మెట్టు గోవింద రెడ్డి ని ఇన్ చార్జ్ గా ఎంపిక చేసారు.(YSRCP Third List Released)
- Darsi (MLA): Buchepalli Shiva prasada Reddy : దర్శి అసెంబ్లీ నియోజక వర్గానికి ఇన్ చార్జ్ గా శ్రీ బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి ని నియమించారు.
- Pootalapattu (MLA-SC): Muthirevula Sunil Kumar: పూతల పట్టు అసెంబ్లీ నియోజక వర్గానికి శ్రీ మూతి రేవుల సునీల్ కుమార్ ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
- Chittoor (MLA): Vijayananda Reddy: శ్రీ విజయానంద రెడ్డి చిత్తూరు అసెంబ్లీ కి ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
- Madanapalle (MLA): Nissar Ahmed : మదనపల్లె అసెంబ్లీ కి శ్రీ నిస్సార్ అహ్మద్ ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
- Rajampet (MLA): Akepati Amarnadha Reddy : శ్రీ ఆకేపాటి అమర నాథ రెడ్డి రాజం పేట అసెంబ్లీ ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
- Aluru (MLA): Boosine Virupakshi : ఆలూరు నుండి బూసినే విరూపాక్షి అసెంబ్లీ ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
- Kodumuru (MLA – SC) Dr. Satish : కోడుమూరు అసెంబ్లీ కి ఇన్ చార్జ్ గా డా. సతీష్ ను నియమించారు
- Guduru (MLA-SC) Meriga Murali : గూడూరు అసెంబ్లీ కి ఇన్ చార్జ్ గా శ్రీ మేరిగ మురళి నియమితులయ్యారు.
- Satyavedu (MLA-SC) Maddila Gurumoorthi : తిరుపతి సిట్టింగ్ ఎంపీ గా ఉన్న శ్రీ మద్దిల గురుమూర్తి ఈ సారి అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. సత్యవేడు అసెంబ్లీ కి ఆయన ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
- Penumaluru : (MLA):Jogi Ramesh : ప్రస్తుతం మంత్రి గా చేస్తున్న శ్రీ జోగి రమేష్ ఈ సారి మాత్రం పెనుమలూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
- Pedana (MLA): Uppala Ramu : పెడన అసెంబ్లీ నియోజక వర్గానికి శ్రీ ఉప్పాల రాము ఇన్ చార్జ్ గా నియమితులయ్యారు.
వైసీపీ విడుదల చేసిన ఈ మూడవ జాబితాలో బీసీ లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మరికొన్ని మార్పులతో నాల్గవ జాబితా కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే లుగా ప్రస్తుతం చేస్తున్న వారిని ఎంపీ నియోజక వర్గాలకు పంపడం ద్వారా సమీకరణాల సమతుల్యత దెబ్బతినకుండా చూసుకొంటోంది వైసీపీ. నియోజక వర్గాల మార్పులు ఆయా ఎమ్మెల్యే లు మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏమైనప్పటికీ మన సీటు భద్రం గా ఉండాలంటే ముందు ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పకనే చెప్పినట్టు అవుతోంది ఈ ఎంపికలు చూస్తుంటే… తెలంగాణా ఎన్నికల కంటే ముందే ఏపీ ఎన్నికలు జరిగి ఉంటే వీలైనంత మంది పాత వాళ్ళతోనే వెళ్లి పరాజయం పొంది ఉండేది వైసీపీ… సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చి కేసీఆర్ చేసిన తప్పే తను చెయ్య కూడదని, కొంచం ఎక్కువ మార్పులకే తెర తీస్తున్నారు. ఈ నిర్ణయం ఎంతవరకూ సఫలీకృతం అవుతుందో తెలియాలంటే.. ఎన్నికల వరకూ వేచి చూడక తప్పదు. (YSRCP Third List Released)
-విజయ్ న్యూస్ డెస్క్
12-01-2024