June 5, 2026
Home » Telugu Poetry – kavitha o kavitha| కవితా ఓ కవితా | తెలుగు ప్రేమ కవితలు

Telugu Poetry – kavitha o kavitha| కవితా ఓ కవితా | తెలుగు ప్రేమ కవితలు

కవితా..ఓ కవితా..
కవితా…నా కవితా….

కలొస్తే కవిత
కలలో నువ్వొస్తే కవిత
కన్నీరొస్తే కవిత
కన్నీటి పై నువ్వు నడిచొస్తే కవిత

Telugu Poetry Kavitha O Kavitha

Telugu Poetry Kavitha O Kavitha

కవితా..ఓ కవితా…..కవితా…నా కవితా….(Telugu Poetry)

కవితా..ఓ కవితా..
కవితా…నా కవితా….

కలొస్తే కవిత
కలలో నువ్వొస్తే కవిత
కన్నీరొస్తే కవిత
కన్నీటి పై నువ్వు నడిచొస్తే కవిత
నువ్వు నవ్వితే కవిత (Telugu Poetry)
నువ్వు కవ్విస్తే కవిత
నీ కళ్ళలో మెరుపు కవిత
నీ చిరునవ్వు తెలుపు కవిత (Telugu Poetry)

ఆకాశం లో మిగిలిన సగాన్ని
నే ఒడిసి పట్టుకొంటే కవిత
చిరునవ్వు కవిత…చిరుగాలి కవిత
నా గుండె మట్టి లో
మొలకెత్తిన నీ జ్ఞాపకం కవిత

తొలి మంచు కణం కవిత
తొలి కిరణ కవనం కవిత
ఆశ కవిత…శ్వాస కవిత
ఆశ నిరాశల ఆరాటం కవిత
బొట బొట రాలే కన్నీటి బొట్ల వంతెన..కవిత
కన్నుల నిండే నీటి చుక్కల కందెన..కవిత (Telugu Poetry)

శూన్యం కవిత..అనంతం కవిత
విశ్వాంతరాళం కవిత
విశ్వ వేదిక పై వేణు గానం కవిత
తొలి చిగురుల వేదిక పై
వేద నాదం కవిత
నా అంతహ్ చేతన కవిత
నా అంతర్యుద్దం కవిత
నా ఉచ్వాసం లోని
ధూళి కణం కవిత
నా నిచ్వాసం లోని
బొగ్గు పులుసు కవిత

నా వెన్నెలొక కవిత
నా వెన్నెముకా కవిత
నా గుండె చప్పుడు కవిత
నా గొంతు ఇప్పుడిక కవిత
నా భావం కవిత
నను నిలబెట్టే
నా వేలి కొసల ఆర్ద్రత కవిత
నా గాఢత కవిత…నా రస స్పర్శ కవిత
నా అభివ్యక్తి కవిత…నా అనంత శక్తి కవిత
ఓనమాల వనం లో
నా వనమాలి కవిత (Telugu Poetry)

నా అగాధం కవిత…నా ఆకాశం కవిత
నా ఆనందం కవిత…నా దుఖం కవిత
నా ఆశయం కవిత…నా ఆశ్రయం కవిత
నా వెలుతురు కవిత…నా వేకువ కవిత
నే విరజిమ్మే ఆత్మ విశ్వాసం కవిత
నే చిత్రించే ప్రతి చిత్తరువూ కవిత
నే ఆప్యాయంగా తలదాచుకొనే అమ్మ ఒడి..కవిత
నా భుజం తట్టి భరోసా ఇచ్చే నాన్న ..కవిత
చిలిపి గా బుగ్గలు నిమిరే నా చెల్లి…కవిత

నా స్వర్గం కవిత..నా నరకం కవిత
నా సౄష్టి కవిత…నా వ్యష్టి కవిత
నా అస్తిత్వం కవిత…నా ఆస్తి మొత్తం కవిత
నా అస్త్రం కవిత…నా శాస్త్రం కవిత
నా వివాదం కవిత….నా నినాదం కవిత
నా నుదుటి పై తను పెట్టే
తొలకరి ముద్దు కవిత
నా మనోక్షేత్రం లో
గడసరి విత్తు కవిత
నీ జ్ఞాపకాన్ని నాటితే కవిత
నీ జ్ఞాపకాన్ని మీటితే కవిత
నీ జ్ఞాపకాన్ని నీటి తో కడిగేస్తే కవిత

జ్ఞాపకాల తిరునాళ్ళ లో రంగుల రాట్నం కవిత
జ్ఞాపకాల అంగడి లో వేడి పకోడీ నా కవిత

కవితా….ఓ కవితా..
కవితా…నా కవితా… (Telugu Poetry)

‘ ఇలాగే ఉండాలి నువ్వు ‘ అంటూ
నీ పై కర్ర పెత్తనం చేస్తున్నదెవరూ?
‘ దాటి రావద్దూ ‘ అంటూ
చక్ర బంధం లో నిన్ను ఇరికిస్తున్నదెవరు..?
అనంతమైన స్వేచకు
సంకెళ్ళు వెయ్యాలని చూస్తున్నదెవరు..?
లే చివుళ్ళ లో గరళాన్ని పోస్తున్నదెవరు..?

నా యువరాణీ…
ఇదిగో నా నిర్జీవ దేహం
నీ కరస్పర్శ తో కవిత్వాన్ని పుష్పించు
ఇదిగో నా పార్దివ శరీరం
నిలువెల్లా కవనమై రాజిల్లు…
నిలువెల్లా కావ్యమై శోభిల్లు…

కవితా..ఓ కవితా
కవితా..నా కవితా